కార్పొరేట్ వేధింపులు: ఉద్యోగి జిమ్ రొటీన్పై మేనేజర్ వివాదాస్పద వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

కార్పొరేట్ రంగంలో విచిత్ర వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగి శారీరక ఫిట్నెస్, జిమ్ రొటీన్పై ఓ మహిళా మేనేజర్ నిత్యం వ్యాఖ్యలు చేస్తూ పని వేళల తర్వాత కూడా పనులు అప్పగిస్తున్నట్లు రెడ్ డిట్లో ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసు సమయం ముగిసినా అదనపు పనులు ఇస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని బాధితుడు వాపోయారు. ఈ ఘటనపై తోటి ఉద్యోగులు రకరకాలుగా స్పందిస్తున్నారు.