ఉద్యోగికి షాక్: వేధింపులపై ఫిర్యాదు చేసినందుకు కంపెనీ నుండి తొలగింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
సీనియర్ మేనేజర్ వేధింపులపై హెచ్ఆర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగి రోహిత్ శర్మను కంపెనీ సర్వీసుల నుండి తొలగించినట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియాలో తెలిపారు. తనను రాజీనామా చేయాలని మేనేజర్ ఒత్తిడి తెచ్చి బూతులు తిట్టాడని, ఈ విషయాన్ని ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచే తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో పెర్ఫార్మెన్స్ బాగోలేదంటూ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఆర్ ఈమెయిల్ ద్వారా వెల్లడించింది.