గురుగ్రామ్ లో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: మూడు వాహనాలు ఢీకొని క్యాబ్ డ్రైవర్ తీవ్ర గాయాలు

రిపోర్టర్: రాము స్థలం: Gurugram

గురుగ్రామ్ లోని డిఎల్ఎఫ్ ఫేజ్ 2 ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు వేగంగా ఢీకొనడంతో ఒక కమర్షియల్ ట్యాక్సీ బోల్తా పడిందని, ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గోల్ఫ్ కోర్స్ రోడ్డులో అర్థరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాగానికి సంబంధించిన దృశ్యాలు వెనుక వస్తున్న వాహనం డాష్క్యామ్ లో రికార్డయ్యాయని, దీనిపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.