నీట్ సీటు వదులుకుని సివిల్స్ సాధించిన అరుదైన వైనం

రిపోర్టర్: సునీల్ స్థలం: Aurangabad

నీట్ అర్హత సాధించినప్పటికీ వైద్య వృత్తి వైపు వెళ్లకుండా సివిల్స్ వైపు అడుగులు వేశారు మానసి సోనావానే. మహారాష్ట్రకు చెందిన ఈ విద్యార్థిని తండ్రి కలను సాకారం చేసేందుకు వైద్య విద్యను వదులుకుని యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించారు. తొలి రెండు ప్రయత్నాలలో విఫలమైనప్పటికీ నిరుత్సాహపడకుండా పట్టుదలతో శ్రమించి మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో ఆరు వందల ఇరవై ఏడో ర్యాంకు సాధించి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్కు ఎంపికయ్యారు.