ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి నా వంతు సహాయ సహకారాలుంటాయని ఎమ్మెల్యే వివేకానంద భరోసా
రిపోర్టర్: సురేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేపీ. వివేకానంద - ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఇటీవల జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో జీడిమెట్ల డిపో నుంచి బరిలోకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్ - ఎన్ఎంయూ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ కూటమికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.