సైదాపురం మండలంలో ప్రభుత్వ వాగు పోరంబోకు భూముల కబ్జా

రిపోర్టర్: సతీష్ స్థలం: Tirupati

తిరుపతి జిల్లా సైదాపురం మండలం ఊటుకూరులో కోట్ల విలువైన ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి కబ్జాకు గురవుతోంది. సర్వే నంబరు 193లోని 58 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 10 ఎకరాలకు పైగా అక్రమార్కులు చదును చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ సుభద్ర స్పందిస్తూ ఆక్రమణలను అడ్డుకున్నామని, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.