ఘనంగా ఆవిష్కృతమైన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

నిర్మల్ జిల్లా కడెం మండల వ్యాప్తంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు, సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు ఘనంగా వందనం సమర్పించారు. ఈ వేడుకల కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.