విశాఖ ఆర్కే బీచ్లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ తీరంలో సీఎం చంద్రబాబు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులతో మాట్లాడిన ఆయన, ఒంటరి మహిళ నాగమణికి పింఛను అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు 11 మండలాల పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.