గుజరాత్‌లో అజ్ఞాత రాజకీయ పార్టీలకు రూ. 1,700 కోట్ల విరాళాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లో ఎలాంటి జనాదరణ, కార్యకలాపాలు లేని ఆరు చిన్న రాజకీయ పార్టీలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,700 కోట్ల భారీ విరాళాలు అందడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఎవరికీ తెలియని ఈ పార్టీల వెనుక బడా నాయకుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఈ నిధుల ప్రవాహంపై సమగ్ర విచారణ జరిపి అసలు లబ్ధిదారులను తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.