ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియాగా విశాఖ వనిత సృజనాదేవి గెలుపు

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో విశాఖకు చెందిన డాక్టర్ సృజనాదేవి ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని కైవసం చేసుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. కొవిడ్ సమయంలో 30 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించిన ఆమె, పేదలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. వైద్య వృత్తి ద్వారా ప్రాణం విలువ తెలుసుకున్నట్లు తెలిపారు.