జిల్లాలో వర్షాభావం: ఎండిపోయిన 888 చెరువులు, ప్రశ్నార్థకంగా మారిన పంటల సాగు
రిపోర్టర్: సురేష్
స్థలం: סangam
సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ఎప్పై ఎనిమిది చెరువులు ఎండిపోయాయని, దీనివల్ల సుమారు లక్షా అరవై ఏడు వేల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని జిల్లా జలవనరులశాఖ ఎస్ఈ దేశినాయక్ వెల్లడించారు. జిల్లాలో భూగర్భజలాలు అడుగుంటుతుండటంతో పాటు చెరువుల్లో నీటి నిల్వ పూర్తిగా తగ్గిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.