తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి రథోత్సవం

రిపోర్టర్: గోపి స్థలం: తిరుమల

తిరుమల శ్రీనివాసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు మహారథంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమలగిరులు మారుమోగగా, రథోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేశాయి.