ఫ్లిప్కార్ట్ పార్శిల్లో వినూత్న లేఖ: ఉత్పత్తులు తిరిగి పంపవద్దంటూ సెల్లర్ వేడుకోలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్లో కల్పేష్ కోలి అనే వినియోగదారుడు ఆర్డర్ చేసిన పార్శిల్లో వచ్చిన వినూత్న లేఖ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. తాను ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నానని, దయచేసి వస్తువులను తిరిగి పంపవద్దంటూ ఒక చిన్న స్లిప్పై సెల్లర్ అభ్యర్థించినట్లు కల్పేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఘటన ఆన్లైన్ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రిటర్న్ పాలసీల ప్రభావంపై చర్చకు దారితీసింది.