స్మార్ట్ ఫోన్ ప్రియులకు బిగ్ అలర్ట్: భారీ బ్యాటరీతో రానున్న గెలాక్సీ ఏ38

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

సాంసంగ్ త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న గెలాక్సీ ఏ38 స్మార్ట్ ఫోన్ లో అత్యంత శక్తివంతమైన ఆరు వేల ఎమ్ఏహెచ్ బ్యాటరీని అమర్చనున్నట్లు టెక్ నిపుణులు వెల్లడించారు. గెలాక్సీ ఏ37 మోడల్ తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు ఉండే అవకాశం ఉందని, అలాగే గెలాక్సీ ఏ58 ఫోన్ కూడా ఇదే బ్యాటరీ సామర్థ్యంతో పాటు అత్యధిక ధరతో విడుదల కానుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.