పిల్లల్లో నోటి ద్వారా శ్వాస: తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
పిల్లలు నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం లేదా గురక పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది సాధారణ అలవాటు కాకపోవచ్చని, ముక్కులో సమస్యలు లేదా అడినాయిడ్స్ వాపు కారణంగా పిల్లలు నోటితో గాలి పీల్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఈఎన్టీ నిపుణులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.