హైదరాబాద్లో అధికారుల ఆంక్షలను ధిక్కరించి హోటళ్ల నిర్వహణ

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

రాజధానిలోని ఐటీ కారిడార్లో నిబంధనలు విస్మరించి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ప్రముఖ రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో జరిపిన ఆకస్మిక తనిఖీలలో వంట గదులు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి శాంపిల్స్ సేకరించారు. లైసెన్సులు రద్దయినప్పటికీ కొన్ని హోటళ్ల నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.