పంపా రిజర్వాయర్లో విషాదం: గల్లంతై తండ్రి, ఇద్దరు కుమారులు దుర్మరణం
రిపోర్టర్: సురేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా శంఖవరం గ్రామానికి చెందిన పిల్లా నారాయణరావుతో పాటు ఇద్దరు కుమారులు పంపా రిజర్వాయర్లో గల్లంతై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా పొలంలో మోటార్ తెచ్చేందుకు వెళ్లిన ముగ్గురూ వరద ఉద్ధృతికి గల్లంతుకాగా, గజ ఈతగాళ్ల సహాయంతో గురువారం వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.