నిర్మల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహణ: కలెక్టర్ భవేశ్ మిశ్రా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను అత్యంత పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు అన్ని తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని, అర్హులందరూ ఓటరు జాబితా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.