అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణా నదిలో అత్యధిక నీటి వాడకం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అయితే సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అని, ఏపీ 71.5 శాతం నీటిని వాడుకుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.