జూరాల జల వివాదంపై కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్ నగర్
తెలంగాణలో జూరాల ప్రాజెక్ట్ జల వివాదం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కృష్ణా బేసిన్లో నీటి మట్టాలు తగ్గి పంటలు ఎండిపోతుండటంతో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జూరాల వేదికగా ఉద్యమానికి తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు నీళ్లివ్వలేకపోతున్నారని, ఏపీకి తరలిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే పూడిక సమస్య, తాగునీటి అవసరాల దృష్ట్యానే నిల్వలు ఉన్నాయని, కర్ణాటకతో చర్చలు జరిపి నీరు తెస్తున్నామని కాంగ్రెస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.