సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకొండ సంతలో పోలీసుల అవగాహన
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ సంతలో అన్నవరం పోలీస్ స్టేషన్ అధికారులు, కానిస్టేబుల్ త్రినాథ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. లాటరీలు, రుణాలు, ఓటీపీల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ నంబర్లు ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు.