ఎయిర్ ఇండియా కొత్త సీఈఓతో రామ్మోహన్ నాయుడు భేటీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఎయిర్ ఇండియా నూతన సీఈఓ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన టెవోల్డే గెబ్రెమరియమ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విమానయాన రంగంలో వస్తున్న మార్పులు, ప్రయాణికులకు మెరుగైన సేవలందించే అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.