ఎన్నికల సంఘంపై నిరసనలపై సీఎం రేఖా గుప్తా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ జరుగుతున్న నిరసనలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుకునేందుకే కొందరు నిరసనల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఈ ఆందోళనలు కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు.