టాలీవుడ్ పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు: నిర్మాత ఎస్కేఎన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ సినీ పరిశ్రమ సంస్కృతిపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవకాశాలు పొందిన తర్వాత పరిశ్రమ సంప్రదాయాలను విమర్శించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే హక్ కు అందరికీ ఉన్నప్పటికీ, వాటి వల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతినకూడదని పేర్కొన్నారు. ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి సినీ రంగంలో పరస్పర గౌరవం ఉండాలని అభిప్రాయపడ్డారు.