క్రేజీ కల్యాణం మూవీ విజయం: ప్రేక్షకులకు నటి అనుపమ పరమేశ్వరన్ ధన్యవాదాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని నటి అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రేజీ కల్యాణం సినిమా సక్సెస్మీట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ కమర్షియల్ చిత్రాలతో పాటు సందేశాత్మక సినిమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.