రష్యా ఇరాన్ దేశాలపై కఠిన ఆంక్షల చట్టంపై ట్రంప్ సంతకం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షల కోసం రూపొందించిన లిండ్సే ఓ. గ్రహాం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం రష్యా నాయకత్వం, ఇంధన రంగం, రక్షణ పరిశ్రమలు, వాణిజ్య నౌకల కార్యకలాపాలకు సహకరించే వారిపై అమెరికా ఆంక్షలు విధించనుంది. గత పన్నెండు నెలల్లో రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేసిన టాప్-ఐదు దేశాల వస్తువులపై నూటికి నూరు శాతం సుంకాలు విధించే విశేషాధికారం ట్రంప్‌నకు లభించింది.