ఢిల్లీ విమానాశ్రయంలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ నిర్బంధంపై ఆప్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ విమానాశ్రయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మూడు గంటల పాటు నిలిపివేసి యాభై వేల రూపాయల జరిమానా విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటన నుంచి తిరిగి వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆప్ పంజాబ్ మీడియా ఇన్చార్జ్ బల్తేజ్ పన్ను ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులతో విదేశాలకు వెళ్లిన సీఎంను కావాలనే అవమానించారని ఆయన మండిపడ్డారు.