విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు: కుళ్లిన ఆహార పదార్థాల సీజ్
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. కైలాష్ పర్బత్ రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణంతో పాటు సుమారు నలభై ఆరు కేజీల కుళ్లిన, పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన పాత ఆహారాన్ని కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు నిర్ధారించి, నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.