ఆర్యదన్ మహమ్మద్ పురస్కారం అందుకున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వికారాబాద్
తమకు ఆర్యదన్ మహమ్మద్ ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారం దక్కడం ఎంతో సంతోషకరమని, ఈ గౌరవాన్ని ఎంతో వినయపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనను ఈ అవార్డుతో సత్కరించిన ఆర్యదన్ మహమ్మద్ ఫౌండేషన్‌కు, ఈ పురస్కారాన్ని అందజేసిన సోదరుడు, మిత్రుడు కేసీ వేణుగోపాల్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని పూర్తిగా ప్రజలకే అంకితం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేయడం విశేషం.