ఇండోనేషియాలో ఫ్రీ మీల్స్ పథకం: 2 వేల మంది విద్యార్థులకు అస్వస్థత

రిపోర్టర్: సతీష్ స్థలం: World

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉచిత పౌష్టికాహార పథకం' వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా అందించిన భోజనం తిన్న సుమారు 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఆహార భద్రతపై తీవ్ర విమర్శలు వస్తున్నా, ప్రభుత్వం ఈ పథకాన్ని వేగంగా విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.