ఢిల్లీలో హోరాహోరీగా ప్రతిపక్ష, బీజేపీ నిరసన ప్రదర్శనలు: భద్రత కట్టుదిట్టం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: దిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఛలో దిల్లీ మార్చ్ నిర్వహిస్తోందని, మరోవైపు 1984 అల్లర్ల బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు విభిన్న ప్రదర్శన చేపట్టారని అధికారు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా పదివేల మందికి పైగా పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను మోహరించి భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.