గృహ నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం: ఏపీలో 3డీ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణం

రిపోర్టర్: సురేష్ స్థలం: Guntur

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించే ఇళ్లకు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం వేదికైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నూతన సాంకేతికతతో చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు ప్రకృతి విపత్తులను తట్టుకునే పటిష్టమైన గృహాలను వేగంగా నిర్మించవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.