హృదయ విదారక ఘటన: వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్‌నగర్
మహబూబ్నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి ఆర్య వర్ధన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా బాటిల్ మూత చిన్నారి గొంతులో పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పసిప్రాయంలోనే చిన్నారి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.