వైకాపా విమర్శలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: పల్లా శ్రీనివాసరావు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

మెగా డీఎస్సీలో పదினாறு వేల ఉపాధ్యాయ పోస్టులను వంద శాతం పారదర్శకతతో భర్తీ చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డీఎస్సీపై వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.