అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరిగిన రాగి ధరలు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమెరికా
అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఒక టన్ను కాపర్ ధర ఏకంగా రూ.13.73 లక్షలకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం, లోహ దిగుమతులపై సుంకాలు పెంచే అవకాశం ఉందనే అంచనాల కారణంగా ట్రేడర్లు పెద్దఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. పారిశ్రామిక రంగంలో కాపర్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ధరల భగ్గుమనడానికి ప్రధాన కారణం.