జీవిత భాగస్వామిలో ఉండాల్సిన అర్హతలు వెల్లడించిన ప్రముఖ నటి సాయిపల్లవి
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
తనకు కాబోయే భర్త మంచి మనసున్న వ్యక్తి అయి ఉండాలని, తప్పులను సరిదిద్దుకునే గుణం కలిగి ఉండాలని ప్రసిద్ధ నటి సాయిపల్లవి వెల్లడించారు. హిందీలోని ప్రతిష్టాత్మక కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం పదహారవ సీజన్లో పాల్గొన్న సందర్భంగా ఆమె తన జీవిత భాగస్వామిపై ఉన్న అంచనాలను స్పష్టం చేశారు. భాగస్వామి వంట చేయడం నేర్చుకుని ఉండాలని కూడా ఆమె సరదాగా పేర్కొన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.