స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు జాతీయ రెండో ర్యాంకు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 ఫలితాల్లో గుంటూరు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. 3-10 లక్షల జనాభా కేటగిరీలో నిలిచి రూ.25 లక్షల నగదు బహుమతి అందుకుంది. విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని పలు నగరాలు, వార్డులు మెరుగైన ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి.