'దేశ ప్రగతికి మీ నాయకత్వం స్ఫూర్తిదాయకం': అదితి గజపతి

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న దూరదృష్టితో కూడిన నాయకత్వం, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని పూసపాటి అదితి విజయనగరం పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దేశ సేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ పూసపాటి అదితి విజయనగరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.