బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: శైలపుత్రి రూపంలో అమ్మవారి దర్శనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారని వెల్లడించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.