'రికార్డు ధర పలికింది..': వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు భారీ గిరాకీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: వరంగల్
తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర రికార్డు సృష్టించింది. బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరగడంతో క్వింటా మొక్కజొన్న ఏకంగా రూ. 2,775 పలికింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే అదనంగా రూ. 375కు పైగా ధర లభించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ తయారీ యూనిట్లు, పౌల్ట్రీ రంగాల నుంచి కొనుగోలు ఒత్తిడి పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.