కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ వైట్ హౌస్‌లోకి మీడియా ప్రవేశాన్ని నిరాకరించిన ట్రంప్ యంత్రాంగం
రిపోర్టర్: హరి
స్థలం: వాషింగ్టన్
అమెరికాలో మీడియా స్వేచ్ఛపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరోసారి ఉక్కుపాదం మోపింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పొలిటికో, ఎంఎస్ నౌ సంస్థల జర్నలిస్టులకు వైట్ హౌస్ ప్రవేశాన్ని నిరాకరించింది. ప్రెస్ పాస్‌లను జప్తు చేసి, అధ్యక్ష భవనంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వైట్ హౌస్ యంత్రాంగం వాటిని అమలు చేయకపోవడంపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.