వైద్య విద్య వైపు అడుగులు వేసిన గిరిజన పసిడి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి చెందిన వంతాల బింగురాజు, కనక దంపతుల కుమార్తె వంతాల జోష్న ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువతిని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. వైఎస్సార్సీపీ నాయకులు వంతాల రామన్న, బీసీవై నాయకులు పాంగి నవీన్, కిల్లో సోమేష్, పాంగి రామారావు తదితరులు జోష్నకు పుష్పగుచ్ఛం అందించి, స్వీట్లు తినిపించి శాలువాతో ఘనంగా అభినందించారు. కష్టపడి చదివి వైద్య విద్యకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.