చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతితో విషాదం
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామంలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన ఆరుగురు చిన్నారుల్లో ఐదో తరగతి విద్యార్థి మండల హేమచందు, నాలుగో తరగతి విద్యార్థులు సరిది చంద్రశేఖర్, శంకరాపు వెంకటేష్ చెరువు గుంతలో జారి మునిగి ప్రాణాలు కోల్పోయారు. నిరుపేద కూలీ కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలురు ఒకేసారి ప్రాణాలు వదలడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బిడ్డల మృతదేహాలను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.