గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతికి వైఎస్ జగన్ నివాళి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీబీ తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు ప్రజలకు ఆయన గర్వకారణమని జగన్ పేర్కొన్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రస్థానం అసాధారణమని వెల్లడించారు.