ఇంద్రకీలాడ్రిపై దసరా ఉత్సవాలకు పకడ్బందీ సాంకేతిక ఏర్పాట్లు.

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాడ్రిపై జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. హోల్డింగ్ ఏరియాలు, సీసీ కెమెరాలు, డిజిటల్ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీఐపీ వాహనాలకు ఏఎన్పీఆర్ కెమెరాలతో అనుమతిస్తారు. పార్కింగ్ వివరాలను అస్త్రం యాప్ ద్వారా లైవ్ అప్‌డేట్స్ అందిస్తారు.