ఆసియా క్రీడల్లోనూ కాషాయ జెర్సీలతో బరిలోకి దిగిన భారత హాకీ జట్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: జపాన్

జపాన్‌లోని కకామిఘారాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళా హాకీ జట్లు తమ తొలి మ్యాచ్‌లలో కాషాయ జెర్సీలతో బరిలోకి దిగాయి. సాంప్రదాయ నీలి రంగు జెర్సీలకు బదులుగా కాషాయ రంగు కిట్లను ధరించడం హాకీ ఇండియాలో చర్చనీయాంశమైంది. అధ్యక్షుడి ప్రకటనకు విరుద్ధంగా ఈ మార్పు జరగడంపై వర్గపోరు నడుస్తోంది. బ్లూ టర్ఫ్ పై విజిబిలిటీ సమస్యల కారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.