కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల 2026 పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఉదయం 8:30 గంటలకు మొదలైన ఈ పోలింగ్‌లో సుమారు ఒకటిన్నర లక్షలకు పైగా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ, ఐసా ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు బరిలో నిలవగా, ఎన్నికల నిర్వహణకు అధికారులు 1,100కు పైగా ఈవీఎంలను, 158 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు.