ముంబైలో ప్రఖ్యాత ఒలింపియా కాఫీ హౌస్ లైసెన్స్ రద్దు
రిపోర్టర్: సునీల్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కొలాబాలో ఉన్న ప్రఖ్యాత ఒలింపియా కాఫీ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు. ఆహార నిల్వ ప్రాంతంలో మూత్రశాల, బొద్దింకలు, ఈగలు ఉండటం మరియు ఫ్రిజ్‌లో మాంసం అవశేషాలు కనిపించడంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టి, సంస్థ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.