తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. రజాకార్ల దమనకాండను గుర్తుచేస్తూ.. నిజాం పాలనలో హిందువులు పడ్డ భయానక పరిస్థితులను వివరించారు. అధికార పార్టీలు మజ్లిస్ భయంతో ఈ వేడుకలను నిర్వహించకుండా తప్పించుకుంటున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.