రామగుండం కమిషనరేట్లో దేశ ఐక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జీవితం, నాయకత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేయించారు.